Naresh, Krishna: కృష్ణ ఆరోగ్యంపై పుకార్లు.. స్పందించిన నరేష్!

సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్వాస సంబంధించిన ఇబ్బందులతో ఆయన బాధపడుతూ హాస్పిటల్లో చేరినట్టు ఆ వార్తల సారాంశం. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ మధ్యనే కృష్ణ గారి భార్య, మహేష్ బాబు తల్లి అయిన ఇందిరా దేవి గారు ప్రాణం విడిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇంతలోనే కృష్ణ గారికి ఇలా అయ్యిందేంటి అంటూ ఘట్టమనేని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

మరోపక్క కృష్ణ గారు కేవలం రెగ్యులర్ చెకప్ నిమిత్తమే హాస్పిటల్ కి వెళ్లినట్టు ఆయన టీం వెల్లడించింది. ఈ క్రమంలో కృష్ణ గారి ఆరోగ్యం పై సీనియర్ నటుడు నరేష్ స్పందించాడు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.కృష్ణ గారితో పాటు నరేష్ కూడా ఒకే ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే.కృష్ణ గారు కేవలం రోటిన్ చెకప్లో భాగంగానే ఆస్పత్రిలో చేరినట్లు నరేష్ తెలిపారు.

కానీ ఇన్సైడ్ సర్కిల్స్ ఇంకా తేడాగా చెబుతున్నాయి. కృష్ణ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని.. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, ఎవ్వరూ కంగారు పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా చెబుతున్నట్టు ఇన్సైడ్ సర్కిల్స్ తెలుపుతున్నాయి. గచ్ఛబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు కూడా ఇన్సైడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కాసేపట్లో వైద్యులు కృష్ణ గారి ఆరోగ్యం పై స్పందించి క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus