గతకొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. బాలీవుడ్ బుల్లితెర పరిశ్రమకు ఒక రకంగా బ్లాక్ డే అని చెప్పొచ్చు. వరుసగా ముగ్గురు బెస్ట్ యాక్టర్స్ ని ఇండస్ట్రీ కోల్పోవడంతో అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదిత్య సింగ్ రాజ్ పూత్, వైభవి ఉపాధ్యాయ మరణాల మరువకముందే బుల్లితెర పాపులర్ నటుడు నితీష్ పాండే ప్రాణాలో కోల్పోవడం బుల్లితెర ప్రేక్షకులు జీర్ణించుకోలేపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ బుల్లితెరపై కొద్దిరోజుల వ్యధిలోనే వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆదిత్య సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత నిన్న నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ఈ ఘటన మరువక ముందే ప్రముఖ బుల్లితెర నటుడు నితీష్ పాండే (51) కార్డియాక్ అరెస్ట్ కారణంతో కన్నుమూశారు. రూపాలీ గంగూలీ ఆధ్వర్యంలో హిట్ టివీ షోలో ధీరజ్ కపూర్ పాత్రతో నితీష్ పాండే మంచి పేరు సంపాదించారు.
ఆ తర్వాత అస్తిత్వ, ఎక్ ప్రేమ్ కహానీ, సాయా, జస్టజూ, మంజిలీన్ అప్నీ అప్నీ, దుర్గేష్ నందని వంటి పాపులర్ సీరియల్స్ నటించారు. అంతేకాదు బాలీవుడ్ హిట్ మూవీస్ ఓం శాంతి ఓం, బదాయి దో వంటి చిత్రాల్లో కూడా పనిచేశారు. 1990 లో థియేటర్ లో తన నటనా ప్రస్ధానం మొదలు పెట్టారు నితీష్ పాండే. 1995 లో తేజస్ లో డిటెక్టీవ్ పాత్రలో నటించారు.. ఆ తర్వాత పలు సీరియల్స్ లో వరుస ఛాన్సులు దక్కించుకున్నారు. నటించడమే కాదు.. డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో సొంతగా నిర్మాణ సంస్థను కూడా నడిపారు.
ఆయన చివరిసారిగా అనుపమ, ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాల లో కనిపించారు. పాతిక సంవత్సరాలుగా బుల్లితెరపై నితీష్ పాండే తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఉత్తరాఖాండ్ కి చెందిన నితీష్ పాడే.. అశ్విని కల్సేకర్ ను వివాహం చేసుకున్నారు.. 2002 లో ఇద్దరూ విడిపోయారు.. ఆ తర్వాత జస్టజూ అనే టివి షోలో పరిచయం అయిన నటి అర్పితా పాండేని 2003 లో వివాహం చేసుకున్నాడు. ఆయన మృతిపై సోషల్ మీడియాలో సెలబ్రెటీలు సంతాపాన్ని తెలుపుతున్నారు.