8 ఏళ్ళు సినిమాలకు దూరం..’కమిటీ కుర్రోళ్ళు’ లో ఆ పాత్ర నేనే చేయాలి కానీ : నటుడు పవన్ కుమార్ అల్లూరి

  • October 27, 2024 / 02:03 PM IST

పవన్ కుమార్ అల్లూరి (Pawan Kumar Alluri) . ఈ పేరు ఎక్కువమంది వినుండకపోవచ్చు. కానీ కొంచెం గతంలోకి వెళితే.. రాజ్ తరుణ్ (Raj Tarun) – అవికా గోర్ (Avika Gor) కాంబినేషన్లో వచ్చిన ‘ఉయ్యాలా జంపాలా’ (Uyyala Jampala) అనే సినిమా వచ్చింది. అందులో హీరో రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ లో ఒకడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇతను. ‘ఎంత రాజమౌళి (S. S. Rajamouli) అయితే మాత్రం.. రాంచరణ్ (Ram Charan) లేకుండా ‘మగధీర’ (Magadheera) తీయగలడా’ అంటూ ఇతను పలికిన డైలాగ్ ఇప్పటికీ బాగా ఫేమస్. అయితే ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా.. తర్వాత 8 ఏళ్ళ వరకు సినిమాల్లో నటించలేదు ఇతను.

Pawan Kumar Alluri

అందుకు గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పవన్ కుమార్ అల్లూరి మాట్లాడుతూ.. ” ‘ఉయ్యాలా జంపాలా’ తర్వాత నాకు బెంగళూరులో మంచి జాబ్ వచ్చింది. యానిమేషన్ కంపెనీలో నేను జాబ్ చేసుకుంటూ.. ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో నాకు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ‘ఉయ్యాలా జంపాలా’ దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma) మాకు బంధువు. అతను నేను క్లాస్మేట్స్. అందుకే నాకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

ఆ తర్వాత అతను నాని గారితో తెరకెక్కించిన ‘మజ్ను’ (Majnu) సినిమాలో కూడా నాకు ఛాన్స్ ఇచ్చాడు. కానీ నేను జాబ్, ఫ్యామిలీ..లైఫ్ తో బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ‘తను నేను’ ‘పిట్టగోడ’ వంటి సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అవన్నీ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే కోవిడ్ తర్వాత నాకు సినిమాల్లో నటించాలి అనిపించింది.

అలా ‘రంగబలి’ (Rangabali) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాను.అక్కడి నుండి వరుసగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ( Miss Shetty Mr Polishetty) ‘మిస్టర్ బచ్చన్’ ( Mr. Bachchan) ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) వంటి సినిమాల్లో కూడా నటించాను. కానీ ఇదే క్రమంలో నాకు ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) అనే సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో బలి(మేక తల) నెత్తిపై పెట్టుకుని మోసే క్యారెక్టర్ నాకే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మిస్ చేసుకున్నాను. తర్వాత చాలా బాధపడ్డాను” అంటూ చెప్పుకొచ్చాడు.

అంటే పూరికి ఆ హీరో కూడా దొరకనట్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus