Puri Jagannadh: అంటే పూరికి ఆ హీరో కూడా దొరకనట్లే..!

అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni)  , ‘ఏజెంట్’ (Agent)  సినిమా పరాజయం తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ల కోసం సన్నాహాలు చేస్తున్నా, ఇప్పటివరకు ఖచ్చితమైన ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇటీవల పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అఖిల్‌కు ఒక కథ వినిపించాడని, అఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, అఖిల్ టీమ్ ఈ వార్తలను ఖండించింది. దీనిపై అఖిల్ పూర్తి క్లారిటీతో ఉన్నారని, తన కొత్త ప్రాజెక్టుల ఎంపికలో బలమైన కథలను మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

Puri Jagannadh

అఖిల్ కెరీర్‌ను సెట్ చేయాలనే ఉద్దేశంతో వివిధ దర్శకులతో కలిసి వర్క్ చేసినప్పటికీ, ఇప్పటి వరకూ సరైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేకపోయారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’  (Most Eligible Bachelor)  మోస్తరు విజయం సాధించినప్పటికీ, ఇది అఖిల్ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఇక త్వరలోనే మురళీ కిషోర్ దర్శకత్వంలో, తిరుపతి నేపథ్యంతో రూరల్ మూవీతో రానున్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ‘ధీర’ అనే పెద్ద బడ్జెట్ మూవీపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా ‘లైగర్’ (Liger)  , ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) డిజాస్టర్స్ తర్వాత, యంగ్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డతో ఒక కథ వినిపించగా, తర్వాత అఖిల్‌తో చేయనున్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే, అఖిల్ సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేయడంతో, పూరికి మరో హీరో కనుక్కోవాల్సిన అవసరం ఉంది.

ఆ మధ్య హనుమాన్ (Hanuman) ఫేమ్ తేజ సజ్జా (Teja Sajja)  తో కూడా ఓ కథ అనుకున్నట్లు టాక్ వచ్చింది. కుదరకపోతే చిన్న బడ్జెట్ లోనే మంచి కంటెంట్ ఉన్న సినిమా చేయాలని పూరి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి అతని కథలకు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.

‘బాలయ్య 109’ ఆ సమస్య ఇంకా తీరలేదట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus