ఏదైనా ఫిట్టింగ్ పెడితే బాగోదని ముందే వార్ణింగ్ ఇచ్చాను : ప్రియదర్శి

‘నా చావు నేను చస్తా.. నీకెందుకు’ అంటూ ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని ఒక్క డైలాగ్ తో క్రేజీ నటుడు అయిపోయాడు ప్రియదర్శి. ఆ తరువాత ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన ‘తొలిప్రేమ'(2018) , ‘అ!’, ‘ఎఫ్2’, ‘బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలు ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.’మల్లేశం’ చిత్రంతో హీరోగా కూడా మారి సక్సెస్ అందుకున్నాడు. ఇతను బయట ఏ సినిమా ఫంక్షన్లకు వచ్చినా.. చాలా ఫన్నీగా మాట్లాడుతుంటాడు అన్న సంగతి. ఇటీవల అలీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొని తెగ సందడి చేసాడు ప్రియదర్శి.

ఈ క్రమంలో తన జీవితంలో ‘ఛీ’ అని ఫీలయ్యే సంఘటన గురించి చెప్పుకొచ్చి అందరినీ నవ్వించాడు. ప్రియదర్శి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి లైఫ్ లో తలుచుకున్న ప్రతీసారి ‘ఛీ’ అని ఫీలయ్యే‌ సంఘటన ఒకటుంటుంది కదా! అదే ఇది. ఒకానొక రోజు ఓ క్లబ్ కు సంబంధించిన‌ వాళ్లు నాకు ఫోన్‌ చేసి… ‘ఇటీవల మీరు సిటీ సెంటర్‌లో షాపింగ్‌ చేశారు కదా. మీరు రూ.28 వేల విలువైన గిఫ్ట్‌లు గెలచుకున్నారు’ అంటూ మాట్లాడారు. నాకు అప్పటికీ ఏదో తేడా కొడుతుంది.

ఎందుకంటే నా చైల్డ్ హుడ్ డేస్ లో కూడా ఇలాంటిదొకటయ్యింది. అందుకే ‘మీరు ఏదైనా ఫిట్టింగ్‌ పెడితే.. చాలా సీరియస్‌ అవ్వాల్సి వస్తుంది’ అని వాళ్లకు వార్ణింగ్ ఇచ్చాను. ‘అలాంటిది ఏమీ ఉండదు సర్‌. మీరు మీ ఫ్యామిలీతో రండి. మంచి గిఫ్ట్‌’ అన్నారు. ఆ టైములో నేను చందానగర్‌లో ఉండేవాడిని. అంతే నాకు తెలిసిన వాళ్ళని క్యాబ్‌లో తీసుకుని వెళ్లాను. లోపలికి వెళ్లగానే ఇక సీన్ అర్థమైపోయింది. ‘సర్‌.. మీ మా హాలిడే ప్యాకేజ్‌ తీసుకుంటే, మీకు ఈ ఫెసిలిటీస్ లభిస్తాయి. ఇది బెస్ట్‌ హాలిడే ప్యాకేజ్‌’ అంటూ మొదలు పెట్టారు.నాకు ఒళ్లు మండిపోయింది. ఈ తతంగం అంతా బ్లాగ్‌లో రాశాను. బాగా వైరల్‌ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus