Rajendra Prasad: వైరల్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్!

టాలీవుడ్ లో కామెడీ హీరో గా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కి ఎలాంటి ప్రేక్షాధారణ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాస్ హీరో, ఫ్యామిలీ ఆడియన్స్ హీరో మరియు క్లాస్ హీరో ఇలా వివిధ జానర్స్ కి వివిధ హీరోలు రోల్ మోడల్ గా నిలుస్తున్న రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ కామెడీ జానర్ లో స్టార్ స్టేటస్ ని దక్కించుకొని టాలీవుడ్ మొట్టమొదటి కామెడీ హీరోగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఆ రోజుల్లో ఈయన సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సమానంగా వసూళ్లు వచ్చేవి. ఎన్నో వందల సినిమాల్లో కామెడీ హీరో గా నటించిన రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలను పోషిస్తూ మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజేంద్ర ప్రసాద్ జీవితం ఏమి వడ్డించిన విస్తరి కాదు, ఎన్నో కష్టాలు , బాధలు అవమానాలు పడితే కానీ ఈ స్థాయికి ఆయన చేరుకోలేదు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘నా చిన్న తనం లోనే తల్లి చనిపోయింది. అది కూడా తెలుసుకోలేని వయస్సు నాది, అమ్మ తిరిగి వస్తుంది అని ఎన్నో రోజులు ఎదురు చూసాను, ఆ తర్వాత ఆమె కోసం వెక్కిళ్లు పెట్టి మరీ ఏడ్చాను, చనిపొయ్యే పరిస్థితికి వచ్చాను, అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు అర్థం అయ్యేటట్టు చెప్పారు,

అప్పటి నుండి దుర్గమ్మ ని మా అమ్మగా భావిస్తూ వచ్చాను’ అంటూ (Rajendra Prasad) రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ‘కృష్ణారామ’ అనే చిత్రం లో నటించాడు. సీనియర్ హీరోయిన్ గౌతమీ ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి తర్వలోనే ఓటీటీ లో విడుదల కాబోతుంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus