కామెడీ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటకిరిటీ డాక్టర్. రాజేంద్రప్రసాద్. కామెడీకి హీరోయిజాన్ని, స్టార్ స్టేటస్‌ని అందించిన నటుడాయన. ఒకవైపు హాస్య చిత్రాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు . రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి కడుపుబ్బా నవ్వుతూ సమస్యలను కొద్దిసేపైనా మర్చిపోయే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారనడంలో అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి, తెలుగు తేజం పీవీ నరసింహారావు స్వయంగా వెల్లడించారు. నిత్యం పలు రకాల రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసేవారట పీవీ .
వయసు మీదపడటం, కొత్త తరం రాకతో ఇక రాజేంద్రప్రసాద్ పని అయిపొయింది, నటుడిగా కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడినట్లే అని అనుకుంటున్న సమయంలో ” ఆనలుగురు ” సినిమాతో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు కామెడీ ఫాదర్‌గా తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లు తెలుగు తెరను దున్నేస్తున్న సమయంలో నటకిరిటీ వారికి గట్టిపోటినిచ్చారు. హాలీవుడ్ సినిమాలోనూ నటించిన అతికొద్ది మంది దక్షిణాది నటుల్లో రాజేంద్రుడు కూడా ఒకరు.
క్విక్‌గన్ మరుగన్‌గా ఆయన మెప్పించారు. ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే అత్యధిక మొత్తాన్ని పారితోషికంగా అందుకున్నారాయన. అంది ఎంతో తెలుసా రూ.35 లక్షలు. ఇదే ఇప్పటి వరకు రాజేంద్రప్రసాద్ అందుకున్న హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ . దీనిని బట్టి ఆయన స్టార్ డమ్ వున్న రోజుల్లో కూడా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని అర్ధమవుతోంది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు