కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వే కావాలి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ఆ చిత్రానికి సంభాషణలు రాయడం జరిగింది. ‘నువ్వే కావాలి’ చిత్రంలో సెకండ్ హీరో ప్రకాష్ పాత్రలో నటించాడు సాయి కిరణ్.ఇతను ప్రముఖ సింగర్.. పి.సుశీల గారి మనవడు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ‘నువ్వే కావాలి’ చిత్రం తర్వాత ‘ప్రేమించు’ ‘మనసుంటే చాలు’ ‘ఎంత బావుందో’ వంటి హిట్ చిత్రాల్లో కూడా ఇతను హీరోగా నటించాడు.
ఇంకా ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు… కానీ అవేమీ హిట్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి ‘జగపతి’ ‘షిరిడి సాయి’ ‘నక్షత్రం’ ‘గోపి గోడమీద పిల్లి’ వంటి చిత్రాల్లో నటించాడు. అయితే అలా కూడా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ‘కోయిలమ్మ’ వంటి సీరియల్స్ తో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ ‘పడమటి సంధ్యారాగం’, ‘గుప్పెడంత మనసు’ (ఈ సీరియల్ లో మహేంద్ర) పాత్రలతో బాగా పాపులర్ అయ్యాడు.
ఇక నిన్న ఇతని (Sai Kiran) పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు అయితే ఇతను ఏమీ షేర్ చేయలేదు కానీ.. తన సోషల్ మీడియా ఖాతాలో బర్త్ డే స్పెషల్ అంటూ కొన్ని పిక్స్ ను షేర్ చేశాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన స్టోరీస్ బాగా వైరల్ అయ్యాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :