సీనియర్ నటుడు శరత్ బాబు గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్ది క్షణాల క్రితం ఆఖరి శ్వాస విడిచారు. ఇక ఈయన మరణ విషయాన్ని వైద్యులు అధికారకంగా ప్రకటించారు. శరత్ బాబు వయసు పై పడటంతో గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో ఈయన బెంగుళూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు అయితే మెరుగైన వైద్యం కోసం ఈయనని తన కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
అయితే గత పది రోజులుగా ఈయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇలా చికిత్స తీసుకుంటున్నటువంటి ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించడంతో ఆఖరి శ్వాస వదిలారు. శరత్ బాబు ఆరోగ్యం క్షీనిస్తూ ఇన్ఫెక్షన్ సోకడమే కాకుండా మల్టీ ఆర్గాన్స్ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని తెలుస్తోంది. ఇలా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగానే ఆరోగ్యం క్షీణించి విషమంగా మారిందని తెలుస్తుంది. శరత్ బాబు మరణ వార్త తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది.
ఇక శరత్ బాబు (Sarath Babu) రామరాజ్యం సినిమా ద్వారా 1973 సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పటివరకు సుమారు 250 సినిమాలకు పైగా నటించారు. ఇక ఈయన 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు.
కొద్దికొద్ది రోజులుగా aig హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరో శరత్ బాబు… కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్ లో అడ్మిట్ ఐన శరత్ బాబు.. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలింపు… చికిత్స పొందుతూ ఈరోజు రెండు గంటల ప్రాంతంలో కన్నుమూశారు… బాడీని చెన్నైకి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న కుటుంబ సభ్యులు.