ఒక్కోసారి హీరోలు తమకు తెలియకుండానే పెద్ద పెద్ద తప్పులు చేసేస్తుంటారు. అది స్క్రిప్ట్ విషయంలో కావచ్చు, నటన విషయంలో కావచ్చు. అయితే.. శర్వానంద్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా పెద్ద తప్పు చేసేశాడట. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం లేకపోయినా.. ఆ తప్పు కారణంగా వాటిల్లిన నష్టాల నుంచి కోలుకోవడానికి దాదాపు 3 ఏళ్ళు పట్టిందట. ఇంతకీ శర్వా చేసిన తప్పేమిటి అనుకొంటున్నారా? హీరోగా అప్పుడే మెలమెల్లగా నిలదొక్కుకొంటున్న తరుణంలో.. శర్వానంద్ హీరోగా నటించడంతోపాటు నిర్మాతగానూ మారి “కో అంటే కోటి” అనే సినిమా తీశాడు.
ఆ సినిమాతో నటుడిగా పర్వాలేదనిపించుకొన్న శర్వా.. నిర్మాతగా మాత్రం భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. “ఆవకాయ్ బిర్యానీ” ఫేమ్ అనీష్ కురువిల్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తర్వాత కేవలం అప్పుల నుంచి బయటపడడానికే శర్వానంద్ కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందట.అలా డబ్బు కోసం కొన్ని సినిమాలు, కథలు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసి.. మొత్తానికి ఇప్పటికీ కాస్త సేఫ్ అయ్యాడట. ఇప్పుడు మాత్రం తన మనసుకి నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ.. హీరోగా తనకంటూ వచ్చిన స్టార్ డమ్ ను కాపాడుకుంటూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు శర్వానంద్. శర్వ నటించిన