Pawan, Siva Balaji: మా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ కే మద్దతిస్తాం.. ఆయన ఒక్క మాట చెబితే చాలు: శివ బాలాజీ
- January 19, 2023 / 05:45 PM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయనకు యూత్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా తనకు అభిమానులుగా మారిపోయారు. ఇలా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది సెలబ్రిటీ అభిమానులు కూడా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళటం వల్ల ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఆయన జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందిన శివ బాలాజీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనుకు రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలు కూడా తనకు లేవని తెలిపారు. కానీ నటుడిగా ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానం అని తెలిపారు.

మా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా శివబాలాజీ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెబితే చాలు జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పార్టీకి తన వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు.

నిరంతరం ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి ఈయన పార్టీకి మద్దతు తెలపడం తనకు సంతోషమేనని ఆయన చెబితే సోషల్ మీడియా ద్వారా జనసేన పార్టీకి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా శివ బాలాజీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

















