Sivaji Raja: స్టార్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన శివాజీరాజా..!

నటుడు శివాజీ రాజా తాజాగా రాంగోపాల్ వర్మ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ రాజా ‘రాంగోపాల్ వర్మ అంత చెత్త మూవీస్ ఎవరు తీసి ఉండరని’ వ్యాఖ్యానించాడు. అలాగే దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ప్రయాణంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో శివాజీ రాజా చేసిన ఈ కామెంట్స్ ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్జీవి కాంపౌండ్ హీరోయిన్ అయిన హాట్ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘తలకోన’.

చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు శివాజీ రాజా, ప్రముఖ నిర్మాత రామారావు హాజరయ్యారు. వాళ్ల చేతుల మీదే గానే పాటలు, ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ..తర్వాత రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. “మా ఎంట్రీ 1985లో జరిగింది.

అప్పటివరకు ఇండస్ట్రీ అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. 1988లో ఓ సినిమా వచ్చింది. దాని పేరు శివ. అప్పుడు స్టార్ట్ అయింది అలజడి. రాము అనే ఒక పేరులోనే వైబ్రేషన్. ఆయన తీసిన సినిమాల్లో ‘క్షణ క్షణం’ నేను చూసినన్నిసార్లు ఆయన కూడా చూసి ఉండరు. ‘శివ’ రెండు మూడు సార్లు మాత్రమే చూశాను. ఇప్పటికీ ‘క్షణక్షణం‘ నా ఫేవరెట్ సినిమా అని చెబుతూ ఉంటా. అంత ఇంప్రవైజేషన్ ఉన్న సినిమా మళ్లీ ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రాలేదు.

అంత అందంగా శ్రీదేవి ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇది రాము గారికి సంబంధించిన సినిమా అయినా, అవ్వకపోయినా ఆయన కంటే సీనియర్ గా ఆయన గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఇక ఆయన తీసిన కొన్ని అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ తీయలేదు. ఆయన తీసిన చెత్త సినిమాలు కూడా ఎవరు తీయలేదు. రెండు రికార్డ్స్ ఆయనకే ఉన్నాయి. కానీ ఆయన నుంచి నాలాంటి ఫ్యాన్స్ మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కచ్చితంగా ఆయన నుంచి మంచి సినిమా వస్తుందని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus