Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చిన శివాజీ..! కాఫీ కోసం కేకలు..! అసలు ఏమయ్యిందంటే.,

బిగ్ బాస్ సీజన్ – 7 లో హీరో శివాజీ ఫుల్ ఫైర్ అయ్యాడు. కనీసం ఆర్టిస్ట్ కి మర్యాద కూడా లేదా అంటూ విరుచుకుని పడ్డాడు. కాఫీ మాత్రమే కదా అడిగాను అని, అది అందుబాటులో ఉన్నా కూడా ఎందుకు ఇవ్వడం లేదని రెచ్చిపోయాడు. ఈ క్షణమే తలుపులు తీసినా బయటకి పోతాను అంటూ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చాడు. గంట కూడా వెయిట్ చేయను అని నాకు అసలు ఎలాంటి విభేదాలు లేకపోయినా ఇలా చేయడం కరెక్ట్ కాదని బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో 24 బై 7 టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ అయిన తర్వాత బిగ్ బాస్ 5 వారాలు ఇమ్యూనిటీ టాస్క్ అనేది ఇచ్చాడు. ఈ టాస్క్ లు జరుగుతున్నప్పుడే శివాజీ ఫైర్ అయ్యాడు. రతిక – ఇంకా ప్రియాంక ఇద్దరూ కూడా ఎంత బుజ్జగించినా కూడా రెచ్చిపోయి మరీ అరిచాడు. నేను ప్రజలని ఎంటర్ టైన్ చేయడానికే వచ్చాను. వారికోసమే పనిచేస్తాను. ఎంతోమందితో వర్క్ చేశా.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వచ్చా అయినా కూడా కనీసం కాఫీ కూడా ఇవ్వరా అంటూ..

నా ఈగోని చల్లార్చండి అంటూ అరుపులు మొదలుపెట్టాడు. అయితే, దీనికి బిగ్ బాస్ కౌంటర్ గా రతికకి స్టెత్ స్కోప్ ఇచ్చి అందరి హృదయాల్లో ఏముంది.. ఎవరికి బిపి ఉందో చెక్ చేయమని చెప్పాడు. ఇది శివాజీకి మరింత కోపం తెప్పించింది. నాకు కాఫీ ఇస్తేనే నేను ఇంట్లో ఏదైనా తింటా.. లేదంటా ఇలాగే ఉంటా అని శివాజీ మంకు పట్టుపట్టాడు. బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చాడు.శివాజీ అరుపులకి డాక్టర్ అవతారం ఎత్తిన రతిక భయపడిపోయింది. ఈ వేడిలో పాత స్టెత స్కోప్.. బీపీ మిషన్‌ను తీసి విసిరికొట్టే ప్రయత్నం చేశాడు. ఇలాంటి డొక్కు మిషన్లతో బీపీ చూస్తారా?..

ఇలాంటి మిషన్స్ అసలు ఎవడు వాడటం లేదు అని శివాజీ రెచ్చిపోయాడు. కాఫీ ఇస్తావా గేట్లు ఓపెన్ చేస్తావా.. ఇప్పుడే ఈ క్షణమే వెళ్లిపోవడానికి రెడీ అంటూ చెప్పాడు. రతిక మిగతా ఇంటి సభ్యులు చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. శివాజీగాడు పీకినాడు అని జనం అనుకున్న పర్లేదు నేను వెళ్లిపోతా… పచ్చి మంచి నీళ్లు కూడా ఇక్కడ తాగే ప్రసక్తే లేదు అంటూ రెచ్చిపోయాడు. ఇక బిగ్ బాస్ చాలాసేపు వెయిట్ చేయించి, బిపిని మొత్తం పరీక్షించిన తర్వాత శివాజీని ఒక రూమ్ లోకి పిలిచి మాట్లాడాడు. అంతేకాదు, ఒక కప్పులో కాఫీ ఇచ్చి శివాజీ ఈగోని చల్లార్చి మరీ పంపాడు బిగ్ బాస్.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus