విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీహరి ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ కు ఓ కొత్త టైపు హీరోయిజాన్ని ప్రదర్శించిన వారిలో శ్రీహరి కూడా ఒకరు. అటు తర్వాత ఆయన మళ్ళీ సహాయ నటుడిగా మారి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘కింగ్’ ‘ఢీ’ ‘మహానంది’ వంటి సినిమాల్లో నటించారు. సహాయ నటుడిగా బిజీగా రాణిస్తున్న టైంలోనే ఆయన అనారోగ్య సమస్యలతో మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసింది.
ఆయన పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే. 1996 లో ఈయన డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె ఐటమ్ సాంగ్స్ తో భీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా అటు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా డిస్కో శాంతి చాలా చిత్రాల్లో నటించింది. శ్రీహరి మరణానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమే అని మొన్నామధ్య ఓ సందర్భంలో ఈమె చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె మరో ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. “నా భర్త శ్రీహరి చనిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆయన బ్రతికున్న రోజుల్లో సాయం అంటూ ఎవరు ఇంటికి వచ్చినా లేదనకుండా సహాయం చేసే వారు.సినిమాల్లో ఆయన ఎన్నో కోట్లు సంపాదించారు. కానీ ఇప్పుడు మాత్రం మా కుటుంబ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారింది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
శ్రీహరికి ఇద్దరు కొడుకులు అన్న సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘కోతి కొమ్మచ్చి అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది అన్నారు కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. శ్రీహరి గనుక బ్రతికుంటే మేఘాంశ్ డెబ్యూ వేరేలా ఉండేదేమో..!
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?