అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఫస్ట్ ఆప్షన్ రవితేజ కాదా?

రవితేజ హీరోగా నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సినిమాలలో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కూడా ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా రవితేజ కెరియర్లో బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పాలి. ఇలా రవితేజ కెరీర్ కె ఎంతో మంచి బూస్టప్ ఇచ్చిన ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో నటించడం కోసం ముందుగా హీరో రవితేజను కాకుండా పూరి జగన్నాథ్ మరొక హీరో అయినటువంటి శ్రీరామ్ ను సంప్రదించారట. అయితే ఈయన ఈ సినిమా కథ వినడానికి ముందే ఒకరికి ఒకరు అనే సినిమాకు కూడా సైన్ చేశారని ఈ సినిమా కథ నచ్చడంతో ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటుడు శ్రీరామ్ తెలిపారు.

ఇక ఈ రెండు సినిమాలకు తాను కమిట్ అవ్వడమే కాకుండా త్వరలోనే షూటింగ్ పాల్గొనబోతున్నానన్న సమయంలోనే తాను త్రిషతో కలిసి నటించిన మనసెల్లాం అనే సినిమా షూటింగ్లో తీవ్రమైన గాయాలు పాలు అయ్యాను. ఇలా గాయాలు పాలైన తర్వాత కొంతకాలం పాటు చికిత్స తీసుకున్నటువంటి తాను అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలోని కొన్ని యాక్షన్స్ సీన్స్ చేయలేనని ఉద్దేశంతోనే ముందుగానే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని శ్రీరామ్ తెలిపారు.

ఈ విధంగా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి (Amma Nanna O Tamila Ammayi ) సినిమా నుంచి తాను తప్పుకోవడంతో రవితేజకు అవకాశం వచ్చిందని తెలియజేశారు. అయితే ఈ సినిమా చేసి ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి రవితేజ ఎన్నో సందర్భాలలో నాతో మాట్లాడుతూ వెండి కంచంలో భోజనం తీసుకువచ్చి నాకు తినిపించావు నేను వెంటనే మింగేసాను అంటూ పలు సందర్భాలలో ఈ సినిమా గురించి తన వద్ద ప్రస్తావించినట్లు శ్రీరామ్ తెలిపారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus