Suhas: సుహాస్ అసహనం…నా పారితోషికం గురించి ఎందుకు అంటూ..!

సుహాస్ (Suhas)  హీరోగా చేసిన ‘కలర్ ఫోటో’ (Colour Photo) ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan)  ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ (Ambajipeta Marriage Band)  ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)  వంటి సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ఎలా ఉన్నా అవి ఓటీటీలో బాగా ఆడాయి. అయితే వీటి ఫలితాలను బట్టి అతను పారితోషికం పెంచేసినట్టు.. టాక్ నడుస్తుంది. ఓ సందర్భంలో సుహాస్ కూడా కోట్లల్లో పారితోషికం అందుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో అతని పారితోషికం అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే తరచూ ఎవరొకరు అతని పారితోషికం గురించి ప్రశ్నించడం అనేది అతనికి నచ్చడం లేదు అనుకుంట..

Suhas

అతని అసహనాన్ని ఓపెన్ గానే బయట పెట్టేస్తున్నాడు. అతని నెక్స్ట్ సినిమా.. ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా టీజర్ లాంచ్ వేడుక ఈరోజు జరిగింది. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్… “యాక్టింగ్ తో పాటు యాడ్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. కానీ ఒక యాడ్ చేస్తే ఎంత పారితోషికం తీసుకుంటున్నారో? సినిమా చేసినప్పుడు కూడా అంతే పారితోషికం తీసుకుంటున్నారు? అని బయట టాకు.

ఎంతవరకు నిజమది?” అంటూ సుహాస్ ని ప్రశ్నించాడు. దానికి సుహాస్ చాలా ఇబ్బంది పడ్డాడు. “ఏం టార్చర్ అయిపోయింది నాకు ఇది. జీవితం..! మంచిగానే ఇచ్చారు. కానీ అనుకున్నంత నెంబర్ లేదు. అదేంటో కానీ ‘యాక్టింగ్ బాగా చేస్తావ్’ అనేది వదిలేసి. రెమ్యునరేషన్ బాగా తీసుకుంటున్నావ్.. అని ఇవి వాచ్ చేస్తున్నారు” అంటూ తన అసహనాన్ని బయటపెట్టాడు సుహాస్.

అక్కడితో ఆ రిపోర్టర్ ఆగలేదు.. ‘ ‘స్పిరిట్’ (Spirit) లో కూడా నటించమని మీకు ఆఫర్ వచ్చిందట కదా? ‘ అంటూ సుహాస్ ని ఇంకో ప్రశ్న అడిగాడు. అందుకు సుహాస్..’ అలాంటిదేమీ లేదు’ అని జవాబిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఏప్రిల్‌ 8న అఖిల్‌ నుండి మూడు సర్‌ప్రైజ్‌లు ఉంటాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags