Actor Suman : 1997 లో డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఎవర్ గ్రీన్ భక్తి చిత్రం ‘అన్నమయ్య’. అప్పట్లో ఈ చిత్రం తెలుగు ప్రేక్షక అభిమానుల్లో క్రియేట్ చేసిన మార్క్ మామూలుది కాదు. ఎందుకంటే కమర్షియల్ చిత్రాలు రిలీజ్ అవ్వటం , అవి బ్లాక్ బస్టర్ గా నిలవటం అనేది సర్వ సాధారణం. అయితే ఒక భక్తి చిత్రంతో అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా తెరకెక్కించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ చిత్రంలో హీరో నాగార్జున శ్రీవారి భక్తుడు అయిన ‘అన్నమయ్య’ పాత్రలో తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసాడు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
‘అన్నమయ్య’ మూవీ అంతా నాగార్జున పాత్ర ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించాడు నటుడు సుమన్. అయన ఆ పాత్రకు చేసిన నటన, దానికి వచ్చిన రెస్పాన్స్ ఎప్పటికి మరువనిది. ఎందుకు అంటే, ఆ పాత్రలో అయన ముఖ కవళికలు ఆ వేష ధారణతో అచ్ఛం ఆ దేవ దేవుడు శ్రీవారి ని స్వయంగా చూసిన అనుభూతిని థియేటర్లలో పొందారు సినీ ప్రేక్షకులు. ఇది ఇలా ఉండగా, శ్రీవారి సన్నిధిలో ‘అన్నమయ్య’ వేంకటేశ్వరుడిగా చిరస్థాయిగా నిలిచిన సుమన్ దర్శనం వైరల్ అవుతోంది. అన్నమయ్య సినిమాలో శ్రీవారిగా ఆయన చేసిన అద్భుత నటనను నెటిజన్లు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ప్రశంసించిన సుమన్, అన్నమయ్యలో వేంకటేశ్వర స్వామి పాత్ర దక్కడం తన జన్మకు దక్కిన అదృష్టమని భావోద్వేగంగా తెలిపారు.