Venkat: పవన్ మూవీపై అంచనాలు పెంచిన వెంకట్.. ఓజీలో అలాంటి రోల్ అంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా నటించిన వెంకట్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో వెంకట్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుజీత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు సినిమాలలో చేస్తున్నానని హీరోగా ఇటీవల సినిమా మొదలైందని తెలిపారు.

ఆ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాలేదని అన్నారు. పవన్ ఓజీలో నటిస్తున్నానని అన్నయ్య మూవీ టైమ్ నుంచి పవన్ తో పరిచయం ఉందని అన్నారు. దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత మెగా హీరోతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యం వేసిందని వెంకట్ పేర్కొన్నారు. పవన్ అభిమానులకు ఓజీ మూవీ విందు భోజనం కానుందని వెంకట్ (Venkat) కామెంట్లు చేశారు. సుజీత్ టాలెంట్ ఉన్న డైరెక్టర్ కాగా ఇందులో చాలామంది నటీనటులు ఉన్నారని టాలీవుడ్ లో ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని వెంకట్ చెప్పుకొచ్చారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం జపాన్ ముంబై బ్యాక్ డ్రాప్ లో ఓజీ తెరకెక్కుతోంది. పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండటం గమనార్హం. ఓజీ సినిమా చేతులు మారుతుందని ప్రచారం జరుగుతున్నా నాన్ థియేట్రికల్ హక్కులు మాత్రమే పీపుల్స్ మీడియా సొంతమయ్యాయని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని భోగట్టా.

త్వరలో ఓజీ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. ఓజీ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుండగా ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus