సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారందరూ కూడా రాజకీయాలలోకి వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు రాజకీయ పార్టీలను స్థాపించి రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. హీరో విజయ్ పార్టీ పెట్టకపోయినా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు చేసిన విజయ్ స్వచ్ఛంద సంస్థతో పూర్తి మార్పు తీసుకురావడం అసాధ్యమని భావించి ఇలాంటి మార్పు తీసుకురావడం అసాధ్యమని భావించి రాష్ట్రంలో మార్పు తేవాలి అంటే అధికారం అవసరమని ఈయన ఏకంగా తన రాజకీయ పార్టీని కూడా ప్రకటించారు. తమిళక వెట్రి కజగం పేరుతో తన నేతృత్వంలో ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఇక ఈయన పార్టీ పెట్టకముందే వరద బాధితులకు సహాయంగా నిలవడం చదువులలో టాప్ వచ్చిన వారికి స్కాలర్షిప్ అందజేయడం వంటి ఎన్నో సహాయ సహకారాలను అందించారు. ఇక రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత ఈయన పూర్తిగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పాటు పడతారని తెలుస్తుంది.
ఇల రాజకీయ పార్టీని స్థాపించినటువంటి హీరో (Vijay) విజయ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరపున నుంచి పోటీ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈయన పార్టీ పెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ రాజకీయాల వైపు వెళ్తూ సినిమాలను తగ్గిస్తారు అంటూ మరి కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.