Tamannaah: తమన్నా ఐకాన్… అలా చేయడం తనకే సాధ్యం: విజయ్ వర్మ

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తమన్నా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం లస్ట్ స్టోరీ2 అనే సిరిస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సిరీస్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయ్ వర్మ తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియచేయడమే కాకుండా తనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సిరీస్లో ఆ పాత్రకు తమన్నా మాత్రమే సరిపోతుందని ఈయన తెలియజేశారు.ఈ సిరీస్ చదవగానే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారని తాను ప్రశ్నించానని తెలిపారు. అయితే తమన్న పేరు చెప్పగానే సరైన ఎంపిక అని భావించానని తెలిపారు.నిజానికి ఈ పాత్రకు తమన్నా ఎంతో అద్భుతంగా సెట్ అవ్వడమే కాకుండా ఈ పాత్రకు మరింత గ్లామర్ తీసుకువచ్చిందని విజయ్ వర్మ తెలియజేశారు.

ఇక తమన్నా (Tamannaah) ఏదైనా ఒక పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్ర గురించి లోతుగా పరిశీలించి ఆ పాత్రను చాలా శ్రద్ధగా చేస్తారని తెలియజేశారు. తాను నటించినా బాహుబలి సినిమాను నేను థియేటర్ లో చూశానని అలాగే లేడీ బౌన్సర్ సినిమాని కూడా చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇలా తమన్నా ప్రతి పాత్రను చాలా అద్భుతంగా, శ్రద్ధగా చేయగలరు అలా చేయడం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.

మన తోటి నటీనటులు చాలా సరదాగా ఉత్సాహంగా షూటింగ్ మొత్తం అలా ఉత్సాహంగానే ఉంటుందని తెలియజేశారు. తమన్నా ఓ ఐకానిక్ ఆమె నటన చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారని విజయ్ వర్మ తన ప్రియురాలు తమన్న పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం జరిగిందని ఇదివరకే వీరి ప్రేమ గురించి తమన్న విజయ్ వర్మ ఇద్దరు కూడా తెలియజేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus