Vijay: విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది..!

స్టార్ హీరోల కు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు అభిమానులు. టాలీవుడ్లో కంటే కూడా కోలీవుడ్లో స్టార్ హీరోల పై అభిమానులు చూపించే ప్రేమ మామూలుగా ఉండదు. అక్కడి జనాలు ఒకసారి అభిమానించడం మొదలుపెడితే.. అంచెలంచెలుగా వారి అభిమానం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

ఇతను నటించిన ‘బిగిల్’ సినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇప్పుడు ఓ బాలుడి ప్రాణం కాపాడడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అదెలా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే..ఇటీవల ఓ పదేళ్ల కుర్రాడు అనారోగ్యం పాలయ్యాడు.ఈ నేపథ్యంలో ఆ పిల్లాడి తల్లి దండ్రులు అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పడంతో దానికి ఆ పిల్లాడి తల్లిదండ్రులు అంగీకరించారు.

కానీ ఆ పిల్లాడు మాత్రం మత్తు ఇంజెక్షన్ చేయించుకోనని మారం చేసాడు. దీంతో డాక్టర్లకు ఏం చేయాలో తోచలేదు. అయితే ఆ పిల్లడు విజయ్ ఫ్యాన్ తెల్సుకున్న డాక్టర్.. వెంటనే తన మొబైల్లో బిగిల్ ( విజిల్) సినిమాపెట్టి అతనికి చూపించాడు.ఆ పిల్లాడు సినిమా చూస్తుండగా.. డాక్టర్లు సైలెంట్ గా మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఫైనల్ గా సర్జెరీ పూర్తి చేశారు. తమిళనాడులో ఈ సంఘటన చోటు చేసుకుంది. విజయ్ అభిమానులు ఈ టాపిక్ ను వైరల్ చేస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus