Vishwak Sen: విశ్వక్ సేన్ కొత్త కారు.. రేటెంతో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 6న విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ తో విశ్వక్ సేన్ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. ఏదేమైనప్పటికీ తన సినిమాకి హిట్ టాక్ రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు విశ్వక్ సేన్. తాజాగా తనకు ఇష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల నిజం చేసుకున్నారు.

‘నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉ‍న్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో పాటు దిగిన ఫొటోను షేర్ చేశారు విశ్వక్ సేన్. ఇది చూసిన ఫ్యాన్స్ అతడికి కంగ్రాట్స్ చెబుతున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే..

‘ఆ కారు నాదే.. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చినా’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో లీడ్ రోల్ పోషించారు విశ్వక్ సేన్. అలానే విశ్వక్ డైరెక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’ సినిమాలో తరుణ్ కీలకపాత్ర పోషించారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus