కమల్ టు రవితేజ.. గెటప్స్ తో షాకిస్తారట!

నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. వైవిధ్యమే విజయాన్ని అందిస్తుంది అని అప్పటి స్టార్లు చెప్పేవారు. అయితే పాత్ర బాగా పండాలి అంటే.. వేషధారణ కూడా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు ఒరిజినాలిటీ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడైతే ఎక్కువ సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలి అనుకునే బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు అన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రెండు, మూడు ప్లాప్లు వస్తే రూటు మార్చడానికి కొంతమంది హీరోలు రెడీగానే ఉన్నారు. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే.. కొంతమంది స్టార్ హీరోలు నెక్స్ట్ సినిమాల్లో ఊహించలేని గెటప్స్ లో కనిపించడానికి రెడీ అయ్యారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం :

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఇందులో వృద్ధ వయసు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో కమల్ గెటప్స్ విషయంలో పెద్దగా రిక్స్ చేయలేదు. అయితే ఇండియన్ 2 కోసం తన మేకోవర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ సినిమాల కోసం రవితేజ కొత్త గెటప్ లలో కనిపించబోతున్నాడు.

‘కంగువా’ సినిమా కోసం సూర్య కూడా సరికొత్త లుక్ లోకి మారిపోయాడు.

‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం రాంచరణ్ సైతం మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారట.

కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘మట్కా’ సినిమా కోసం కూడా వరుణ్ తేజ్ గెటప్ మారుస్తున్నారు.

‘జపాన్’ అనే సినిమా కోసం కార్తీ కూడా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు.

వీరితో పాటు ‘నా సామి రంగ’ కోసం నాగార్జున, ‘పుష్ప 2 ‘ కోసం అల్లు అర్జున్, రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు గెటప్ లు (Actors ) మారుస్తున్నట్టు తెలుస్తుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus