గత కొన్నేళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మంచి చేశారు. సేవా కార్యక్రమాల కోసం కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మధ్యకాలంలో ఆయన బయటకొచ్చి ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. తనకు చేతనైనంత సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో యోధా అనే డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ ఈవెంట్ లో చిరు పాల్గొన్నారు. ఇందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం పాల్గొన్నారు.
చాలా పెద్ద స్థాయిలోనే డయాగ్నోస్టిక్ సెంటర్స్ చైన్ మొదలుపెడుతోంది ఈ సంస్థ. ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ఈ సంస్థ సినీ కార్మికులకు ఈ సంస్థ తరఫున తోడ్పాటు కోసం విన్నవించారు. చిరు లాంటి వ్యక్తి అడగడంతో వెంటనే సంస్థ అధినేత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకే కాకుండా.. 24 క్రాఫ్ట్స్ కు చెందిన సినీ కార్మికులందరికీ తమ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో అన్ని పరీక్షలూ 50 శాతం రాయితీతో చేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో సినీ ప్రముఖులు చిరుని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు. ‘మా పెద్ద దిక్కు’ అంటూ చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేశాడు నటుడు బ్రహ్మాజీ. ‘మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు’ అంటూ బండ్ల గణేష్ పోస్ట్ పెట్టాడు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!