Aishwarya Ragupathi: యువకుడు పై చేయి చేసుకున్న ఐశ్వర్య రఘుపతి?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించినటువంటి తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందన్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అదేవిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జనవరి మూడో తేదీ ఈ సినిమా వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమాలో నటించినటువంటి నటి ఐశ్వర్య రఘుపతికి చేదు అనుభవం ఎదురయింది. ఈమె సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడమే కాకుండా యాంకర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా ఈ సినిమాలో ఒక పాత్రలో నటించినటువంటి నటి ఐశ్వర్య రఘుపతి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈవెంట్ పూర్తి అయ్యి అందరూ వెళ్తుండగా అభిమానుల హడావిడి ఎక్కువగా ఉంది దీంతో ఆకతాయి నటి ఐశ్వర్య రఘుపతిని అసభ్యంగా తాకారు. దీంతో ఆ వ్యక్తిని గుర్తించినటువంటి ఆమె తనని పట్టుకొని లాగిపెట్టి కొట్టింది. ఆ యువకుడి పై నటి చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ అందరూ గుంపుగా ఏర్పడ్డారు.

అభిమానులందరూ గుంపుగా చేరడంతో ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఐశ్వర్య మాత్రం ఆ వ్యక్తి తప్పించుకోకుండా ఉండడం కోసం తన కాలర్ పట్టుకొని తనకి బాగా బుద్ధి చెప్పారు. ఏం జరిగింది అనే విషయాన్ని వెల్లడించడంతో అక్కడున్నటువంటి వారు కూడా ఆ యువకుడికి సరైన రీతిలో బుద్ధి చెప్పారని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఐశ్వర్య రఘుపతి స్పందిస్తూ జరిగిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారడంతో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆకతాయి వెదవలు ఎక్కువయ్యారు మంచిగా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus