Alia Bhatt: చరణ్ హీరోయిన్ కు అక్కడ కూడా ఆస్తులున్నాయా..?

హిందీ సినిమాలతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకున్న అలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటారని తెలుస్తోంది. రోజురోజుకు అలియా భట్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా అదే సమయంలో ఆమె ఆస్తుల విలువ కూడా అంతకంతకూ పెరుగుతోంది.

మన దేశ కరెన్సీ ప్రకారం అలియా భట్ ఆస్తుల విలువ 162 కోట్ల రూపాయలని తెలుస్తోంది. పాపులారిటీ ఉన్న బ్రాండ్స్ ను ఇష్టపడే అలియా భట్ దగ్గర అంతర్జాతీయ కంపెనీల కలెక్షన్లు ఉన్నాయి. అలియా భట్ దగ్గర ఖరీదైన లూయిస్ విట్టల్ బ్యాగ్ ఉండగా ఈ బ్యాగ్ ఖరీదు ఏకంగా 1,75,000 రూపాయలు అని తెలుస్తోంది. ముంబైలో అలియాకు విలాసవంతమైన ఫ్లాట్ ఉండగా ఈ ఫ్లాట్ విలువ 13.11 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ ఫ్లాట్ తో పాటు అలియా భట్ కు రణబీర్ ఉండే అపార్ట్‌మెంట్‌లో మరో ఫ్లాట్ ఉంది.

ఈ ఫ్లాట్ ఖరీదు 32 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అలియా భట్ కు వాహనాలంటే ఎంతో ఇష్టం కాగా ఆమె దగ్గర ఉన్న రేంజ్ రోవర్ వోగ్ కారు ధర కోటీ 88 లక్షల రూపాయలు, బీఎండబ్ల్యూ 7 సిరీస్ ధర కోటీ 37 లక్షలు అని సమాచారం. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ బ్యూటీకి ఆస్తులు ఉన్నాయి. లండన్ లోని కోవెంట్ గార్డెన్ లో అలియా భట్ కు ఖరీదైన ఇల్లు ఉండగా మీడియా లెక్కల ప్రకారం ఈ ఇంటి ఖరీదు 16 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ భవనం కళ్లు చెదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus