Alia Bhatt: ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో అలాంటి గిఫ్ట్స్ పంపిన అలియా!

ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు.మెగా ఇంటి కోడలిగా రామ్ చరణ్ సతీమణిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి పెళ్లి అయిన పది సంవత్సరాలకు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఉపాసన తల్లి కాబోతుందనే విషయం ఇటు కుటుంబ సభ్యులలోను అభిమానులలోను ఎంతో సంతోషాన్ని నింపింది.

ప్రస్తుతం ఈమె ఏడు నెలల ప్రెగ్నెంట్ కావడంతో తాజాగా దుబాయిలో ఈమెకు తన కజిన్స్ అలాగే స్నేహితులు ఘనంగా బేబీ షవర్ వేడుకను కూడా నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన తరుచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోని ఈమె బేబీ షవర్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటి ఉపాసనకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపించారు.

ప్రస్తుతం అలియా భట్  ఈద్ ఏ మమ్మ అనే క్లోతింగ్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఏ విధమైనటువంటి దుస్తులు అవసరం అవుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాసన తనకు పుట్టబోయే తన పిల్లలకు అవసరమయ్యే దుస్తులను పంపించారు. ఈ విధంగా ప్రస్తుతం తనకు ఏమీ అవసరమో వాటిని ఇలా గిఫ్ట్ గా పంపించడంతో ఉపాసన అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అలియా భట్  కి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.ఇక అలియా గత కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పిల్లలకు కూడా ఇలా బట్టలు పంపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలో నటించి తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus