Ananya Nagalla: అనన్య నాగళ్ళ సినిమాకి వెరైటీ ప్రమోషన్స్!

ఈ మధ్య కొన్ని సినిమా యూనిట్లు ప్రమోషన్స్ ని వింత వింతగా ప్లాన్ చేస్తున్నాయి. నిన్ననే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ లాంచ్ ను బేగంపేట శ్మశానంలో జరపబోతున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. దీంతో ఒక్కసారిగా ఆ సినిమా గురించి చర్చ మొదలైంది. ఇదిలా జరిగి.. 24 గంటలు కాకుండానే, మరో సినిమా యూనిట్.. ఇలాంటి వింత స్ట్రాటజీ ఇంకోటి వర్కౌట్ చేయడానికి రెడీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో ‘తంత్ర’ అనే సినిమా రూపొందింది.

శ్రీహరి తమ్ముడు శ్రీధర్ కొడుకు అయిన ధనుష్ రఘుముద్రి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. టైటిల్ ని బట్టే చెప్పవచ్చు ఇది హారర్ జోనర్లో రూపొందిన మూవీ అని..! తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి ‘ A ‘ సర్టిఫికేట్ ఇచ్చారు. భయపెట్టే సన్నివేశాలు వంటివి ఉంటే సెన్సార్ వాళ్ళు ‘A ‘ రేటింగ్ ఇస్తారు. కానీ దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది చిత్ర బృందం.

‘మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దు.. మాది ‘A’ రేటింగ్ సినిమా’ అనే టెక్స్ట్ ను హైలెట్ చేస్తూ పోస్టర్ ని వదిలింది. దాని గురించి అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది? ఇలా పోస్టర్ డిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ నెటిజన్లు ఈ అంశం పై డిస్కషన్లు పెట్టారు.ఈ పోస్టర్ ను బట్టి.. ‘సినిమాలో అనన్య నాగళ్ళ (Ananya Nagalla) బోల్డ్ సీన్స్ కూడా ఏమైనా ఉంటాయా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus