టాలీవుడ్ హాట్ యాంకర్ నుండి బోల్డ్ యాక్ట్రెస్‌గా మారిన అనసూయ భరద్వాజ్ (Anasuya) గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరపై రచ్చ చేసి, ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌పై సత్తా చాటుతున్న ఈ అందాల భామ, తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ, ఫుల్ జోష్ మీదున్న ఈ రంగమ్మత్త, ఇప్పుడు టీవీ షోలకు కాస్త గ్యాప్ ఇచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయమే.
కొత్త ఇంటి గృహప్రవేశం, పెద్ద కొడుకు శౌర్య భరద్వాజ్ కు ఉపనయనం అంటూ ఫ్యామిలీ ఫంక్షన్లతో హడావిడిగా ఉన్న అనసూయ, హనుమాన్ జయంతి నాడు చేసిన ఈ వేడుక ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరించింది. ఇదంతా ఒక ఎత్తయితే, తాజాగా సంప్రదాయ చీరకట్టులో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, దాని వెనుక ఉన్న కష్టాలను ఏమాత్రం దాచుకోకుండా చెప్పేసింది.
తొమ్మిది గజాల పట్టుచీరలో దేవకన్యలా మెరిసిపోతూ ‘ఈ చీరకట్టులో ఉన్న అందం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కానీ దీని వెనుక కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, పదహారు గంటల సుదీర్ఘ షూటింగ్ సమయంలో, సరైన టైమ్ కు బాత్రూమ్ కి వెళ్లలేని ఇబ్బంది ఉంటుంది. అయినా, ఈ పోరాటంలో ప్రతి అంశం నాకు ఎంతో విలువైంది.
ఎందుకంటే, ఈ లుక్ అంటే నాకు పిచ్చి ప్రేమ’ అంటూ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టింది.ఈ బ్యూటీ ధైర్యానికి, నిజాయితీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ, అనసూయ డెడికేషన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రొఫెషనలిజం అంటే ఇదే మరి.