తెలుగు అమ్మాయి అయినప్పటికీ అంజలి కోలీవుడ్ లో నిరూపించుకొని టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటించి ఫామ్లోకి వచ్చింది. మసాలా, బలుపు సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన అంజలి… గీతాంజలి వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాతో సక్సస్ అందుకుంది. చాలా వేగంగా సాగుతున్న ఆమె కెరీర్ సడన్ గా స్లో అయిపోయింది. కారణం తెలియదు కానీ తెలుగు నిర్మాతలు ఆమెను సంప్రదించడమే మానేశారు. రీసెంట్ గా గుంటూరు టాకీస్ 2 కి అంజలిని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ అది కూడా ఆగిపోయిందని సమాచారం. తెలుగులో చిత్రాంగద ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలకే పరిమితమైన ఈ భామ తెలుగులో సినిమాలు చేయడానికి తపిస్తోంది.
అందుకే రెమ్యునరేషన్ గురించి నిర్మాతలు ఆలోచించకండి.. ఛాన్స్ ఇవ్వండి చాలు అని అంజలి అడుగుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఏడాదికి రెండు, మూడు సినిమాలు నిర్మిస్తుంన ఓ నిర్మాతకి అంజలి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అసలు సినిమా రిలీజ్ కి ముందు రెమ్యునరేషన్ ఇవ్వకండి. హిట్ అయితేనే ఇవ్వండి అని కూడా చెప్పిందంటా. అందుకే ఆమె కోసం ఓ లేడీఓరియేంటేడ్ సినిమా కథని పేపర్ చేయమని తన టీమ్ కి సదరు నిర్మాత చెప్పినట్లు టాక్. సో అంజలి త్వరలోనే తెలుగు సినిమా చేయనుందన్నమాట.