వెంకటేష్ గారు ఆ టైములో బాగా హెల్ప్ చేశారు : అంజలి

  • January 7, 2020 / 07:12 PM IST

‘ఫోటో’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగు అమ్మాయి అంజలి.. ఆ తరువాత ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ అనే డబ్బింగ్ చిత్రాలతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో అప్పటి వరకూ ఉన్న క్రేజ్ ను డబుల్ చేసుకుంది. అయితే అనుభవం ఉన్న నటులు ఎటువంటి సీన్ ను అయినా.. చాలా ఈజ్ తో చేసేస్తారు. వాళ్ళని మ్యాచ్ చేస్తూ ఓ కొత్త ఆర్టిస్ట్ .. ఓ సీన్ చెయ్యాలి అంటే చాలా కష్టపడాలి. అటువంటి సంఘటనే.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ షూటింగ్ సమయంలో మన సీత(అంజలి) కి ఎదురైందట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంజలి మాట్లాడుతూ… ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మొదటి రోజు షూటింగ్ టైములో… వెంకటేశ్ .. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కాంబినేషన్లో సీన్ ఉంటుంది అని నాకు చెప్పారు. ముగ్గురూ చాలా సీనియర్ ఆర్టిస్టులు. దాంతో నాలో భయం స్టార్ట్ అయ్యింది. చమటలు కూడా పట్టేశాయి. వాళ్ళ టైమింగ్ తో నేను మ్యాచ్ చేయగలనా…? లేక చేయలేనా..? అనే భయం మొదలైంది. నా వల్ల రీ టేక్ అంటే సీనియర్ ఆర్టిస్టులు ఫీలవుతారేమో అనే భయం కూడా ఏర్పడింది. నా ఇబ్బందిని గ్రహించిన వెంకటేష్ గారు ‘ఫరవాలేదు నీకు వచ్చింది చెయ్’ అన్నారు. ప్రకాశ్ రాజు గారు కూడా ‘బంగారు తల్లి’ అంటూ నాలోని భయాన్ని పోగొట్టారు. మూడు నాలుగు రోజుల తరువాత భయం పోవడంతో ఈజీగా చేసేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus