Actress Archana: అతని నిజస్వరూపం బయటపెట్టిన అర్చన!

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినా నటి అర్చన స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అర్చనకు సినిమా ఆఫర్లు తగ్గాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించిన అర్చన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా రంగంలో తను ఎదుర్కొన్న అనుభవాల గురించి పంచుకున్నారు. ఒక డైరెక్టర్ రోజుకొకసారి స్క్రిప్ట్ ను మార్చి, డైలాగ్స్ ను మార్చి నాన్సెన్స్ చేశాడని అతడిని చూసిన తర్వాత మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా? అని అనిపించిందని అర్చన అన్నారు.

ఆ డైరెక్టర్ సెట్ లో డిఫరెంట్ గా ఉండేవారని తను సినిమా నుంచి వెళ్లిపోతానని భావించి కలుస్తానని ఇంటికొచ్చి మాట్లాడతానని చెప్పేవారని అర్చన పేర్కొన్నారు. ఆ డైరెక్టర్ ఇంటికొచ్చిన సమయంలో ఆయన చేసేది కరెక్ట్ కాదని చెప్పానని ఆ తర్వాత తనకు డబ్బులు వద్దని చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయానని ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అర్చన వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం ఒక సంఘటన జరిగిందని పెద్దగా సక్సెస్ ఫుల్ కాని ఒక హీరో తనకు తెలియకుండా

తన గురించి వెనకాల స్టేట్ మెంట్స్ ఇచ్చారని అర్చన పేర్కొన్నారు. ఆ హీరో చాలా సింపుల్ గా ఉంటారని అయితే ఆ హీరో నిజస్వరూపం మాత్రం వేరే ఉందని ఆ హీరో వంకరగా ఆలోచించేవాడని అర్చన చెప్పుకొచ్చారు. ఎవరి అండ లేనివాళ్లు, అందమైన అమ్మాయిలు సెట్ లో ఉంటే ఆ అమ్మాయిల మైండ్ ను క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వాళ్లు రెడీగా ఉంటారని అర్చన షాకింగ్ కామెంట్లు చేశారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus