ఓ పక్క సీరియల్స్ లో నటిస్తూనే మరోపక్క యూట్యూబ్ లో కూడా బాగా పాపులర్ అయ్యింది అస్మిత. ఆవిడ జర్నీ ఇప్పుడు ఓ సక్సెస్ స్టోరీ అయ్యింది. ‘యాష్ ట్రిక్స్’ అనే పేరుతో చేస్తున్న వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్న అస్మిత.. సోషల్ మీడియా క్వీన్ అవ్వడం వెనుక పెద్ద కథే ఉంది.చాలా మందికి అది ఇన్స్పిరేషన్ అని కూడా అనొచ్చు.సొంతంగా మేకప్ కిట్ లు వంటివి ఎలా తయారు చేసుకోవచ్చు..
వాటికి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాల పై వీడియోస్ చేసి అస్మిత క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే మోటివేషనల్ వీడియోలు కూడా చేస్తుంటుంది. అయితే ఆమెను మొదట ఎగతాళి చేసినవాళ్ళే.. తర్వాత ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అంటూ చెప్పి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైంది అస్మిత. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘ఎ1 ఫ్రమ్ డే1’ అనే వెబ్ సిరీస్ ని రూపొందించింది అస్మిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
“నేను నటిగా బిజీగా ఉన్న టైంలో డిజిటల్ మీడియా వైపు అడుగులు వేశాను. సీరియల్స్ లో,సినిమాల్లో నేను బిజీగా గడిపాను. అయితే ఒకసారి అలా పాపులర్ అయ్యాక మళ్ళీ ఇలా యూట్యూబర్ గా మారడం ఏంటి? అని తోటి నటీనటులు నన్ను అడిగేవారు.అసలు ఇలాంటివి ఎలా చూస్తారు? ఎవరు చూస్తారు అని ఎగతాళి కూడా చేశారు.
కానీ నన్ను అలా ఎగతాళి చేసిన ప్రతీఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ను స్థాపించి వీడియోలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు నాకు పోటీ అని కాదు కానీ.. వాళ్ళను చూస్తే నాకు ఆనందంగా అనిపిస్తుంది. యాష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుధీర్ సహాకారం కూడా చాలా ఉంది” అంటూ అస్మిత చెప్పుకొచ్చింది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!