Bhagyashree: భాగ్య శ్రీ అలా చేస్తుందని నేననుకోలేదు.. నటుడు షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘యువరత్న రాణా’ చిత్రంలో చెల్లెలి పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా కాలం ఈమె తెలుగు సినిమాలో నటించలేదు.దానికి కారణాలేంటో తెలీదు. అయితే గత ఏడాది వచ్చిన ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ తల్లిగా నటించింది. ఈ సినిమాలో ఓ పక్క అమ్మ ప్రేమను చూపిస్తూనే మరోపక్క క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టపడే గృహిణిగా కనిపించింది.

అలాగే ఇటీవల వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి'(హిందీ) లో తల్లి పాత్ర పోషించింది. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో… ఆ పాత్ర వల్ల ఈమెకు కలిసొచ్చిందేమి లేదు. ఇదిలా ఉండగా.. గతంలో భాగ్యశ్రీ చాలా లవ్ స్టోరీస్ లో నటించింది. కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించినా అవి శృతిమించలేదు. అయితే ఓసారి శృతిమించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని నటుడు సమీర్ సోని వివరించాడు.

అతను మాట్లాడుతూ.. ” ఓ సినిమా షూటింగ్ లో భాగ్యశ్రీ తో పాల్గొనాల్సి వచ్చింది.అందులో ఆమె అంధ బాలికగా కనిపించింది. అయితే మా మధ్య శోభనం రాత్రి సన్నివేశం చేయాల్సి వచ్చింది. అందుకోసం కిటికీ దగ్గర, వెన్నెల కింద చాలా చక్కని ఫ్రేమ్ ని సెట్ చేశాడు దర్శకుడు. అయితే నేను ఆమె దగ్గరికి వెళ్లిన ప్రతిసారి ఆమె దూరంగా వెళ్లిపోయేది. ఇలా చాలా సార్లు జరిగింది.

సమస్య ఏమిటని నేను (Bhagyashree) ఆమెను అడిగాను. అందుకు ఆమె పక్కకు తీసుకెళ్లి.. .. ‘నాకు చిన్న పిల్లలున్నారు. నన్ను ఇలా చూస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీలవుతారు. సినీ కెరీర్ కంటే నా కుటుంబానికి నేను అధిక ప్రాధాన్యత ఇస్తాను’ అని చెప్పింది. దీంతో ఆమె చెప్పింది నేను దర్శకుడికి చెప్పి నచ్చజెప్పాను” అంటూ ఆమె అతను చెప్పుకొచ్చాడు

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus