Bhagyashree, Prabhas: ప్రభాస్ పై భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్లు!

స్టార్ హీరో ప్రభాస్ మనస్సు బంగారం అని ఆయనతో పని చేసిన నటీనటులు చెబుతుంటారు. ఒకే సమయంలో ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తుండగా రాధేశ్యామ్ సినిమా మొదట విడుదల కానుంది. ప్రభాస్ తో పని చేసే నటీనటులు ప్రభాస్ తిండి పెట్టి చంపేస్తాడని చెబుతుంటారు. ముఖ్య నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్లు వెళుతుంటాయని రకరకాల వంటకాలను చేయించి ప్రభాస్ సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తుంటారని ప్రభాస్ సినిమాల్లో నటించే నటీనటులు కామెంట్లు చేస్తుంటారు.

రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటి భాగ్యశ్రీకి ప్రభాస్ తన సొంతూరి నుంచి పూతరేకులను తెప్పించారు. ప్రభాస్ ఇచ్చిన స్వీట్ బాక్స్ లను ట్విట్టర్ లో షేర్ చేసిన భాగ్యశ్రీ పూతరేకులు ఎంతో రుచిగా ఉన్నాయని ప్రభాస్ తనను నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. స్వీట్లు తింటే ఫిట్ నెస్ కోల్పోతానేమో అనే భయంతో భాగ్యశ్రీ ప్రభాస్ నాశనం చేస్తున్నాడంటూ షాకింగ్ కామెంట్లు చేశారని తెలుస్తోంది. రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కు తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు.

అతి త్వరలో రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కానుండగా ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన స్పష్టత రావాల్సి ఉంది. విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ప్రభాస్, పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా ప్రభాస్ కార్ల కంపెనీ ఓనర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. దసరా పండుగకు రాధేశ్యామ్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus