Bhumika Chawla: భూమిక కొత్త సోషల్‌ పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించో!

ఆల్‌మోస్ట్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితో కలసి నటించింది భూమిక. అది కూడా అతి తక్కువ సమయంలో. ఇలాంటి ఫీట్‌ సాధించిన కథానాయికలు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ క్రమంలో ఆమె తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, పంజాబీ, హిందీ పరిశ్రమల్లో అదరగొట్టేసింది. అయితే ఏమైందో కానీ… ఉన్నఫళంగా అన్నీ మానేసింది. తిరిగి మళ్లీ సినిమాలు మొదలెట్టింది. హీరోయిన్‌ పాత్రలు కాకుండా వదిన, అక్క లాంటి సీనియర్‌ పాత్రల్లో నటిస్తోంది.

Click Here To Watch

అవి కూడా సెలక్టివ్‌గానే. దీంతో పాటు సోషల్‌ మీడియాలో శిక్షణా తరగతులు తీసుకుంటోంది. అదేంటి సోషల్‌ మీడియాలో క్లాస్‌లా… ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారా? నిజమే ఆమె డైరెక్ట్‌గా క్లాస్‌లు తీసుకోవడం లేదు. ఇన్‌డైరెక్ట్‌గా పాఠాలు చెబుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్లు, ఫొటోల ద్వారా. గత కొంత కాలంలగా భూమిక కొత్త కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తోంది. వాటితోపాటు ఇంగ్లిష్‌లో పెద్ద పెద్ద కొటేషన్లు రాస్తోంది. అవేంటి, ఎందుకు రాస్తుంది, దాని వెనుక ఆంతర్యం ఏంటి అనేదే ఇక్కడ ప్రశ్న.

అంతగా ప్రశ్న ఎందుకు అంటే ఆమె ఆ కొటేషన్లతో సమాధానం చెబుతుందా? లేక ఎవరికైనా వార్నింగ్‌ ఇస్తోందో తెలియడం లేదు. తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన భూమిక… ఎవరితోనైనా సంభాషించేటప్పుడు మీ మాటలు జాగ్రత్త. ఇతరుల గురించి మాట్లాడేవైనా, మీ గురించి మీరు మాట్లాడుకునేవైనా, ఈ ప్రపంచానికి వినిపిచేవైనా… ఇలా ఏవైనా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అవి నిజమవుతాయి అంటూ వేదాంత ధోరణిలో రాసుకొచ్చింది. ఇటీవల కాలంలో భూమిక సోషల్‌ మీడియా పోస్టులు దాదాపుగా ఇలానే ఉంటున్నాయి.

జీవితంలో అన్నీ చూసేసిన వేదాంతిలాగే… పోస్టులు పెడుతోంది. తనకు ఎటువంటి మంచి చేయని వారిని, ఏదన్నా అంటే తిరిగి అనలేని వారిని ఓ వ్యక్తి ఎలా చూసుకుంటాడు అనేదే అతని గుణం అంటూ ఆ మధ్య మరో పోస్టు పెట్టింది భూమిక. ఇదంతా చూస్తుంటే ఇవేవో సరదాగా చేస్తున్న పోస్టుల్లా కనిపించడం లేదు. మరి భూమిక ఏమంటుందో, రేపు ఏం రాస్తుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus