భూమిక చావ్లా సెకండ్ ఇన్నింగ్స్ లో కొనసాగుతున్నారు. కెరీర్ బిగినింగ్ లో భూమిక టాలీవుడ్ ని షేక్ చేసింది. పలు ఇండస్ట్రీ హిట్స్ లో నటించింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఖుషి, ఒక్కడు, సింహాద్రి బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. ఆ దెబ్బతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించారు. కెరీర్ పీక్స్ లో ఉండగా మిస్సమ్మ వంటి ప్రయోగాత్మక చిత్రం కూడా చేసింది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. ఆమె రీసెంట్ మూవీ కిసీ కాగా భాయ్ కిసీ కీ జాన్.
సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కీలక రోల్ చేశారు. వెంకటేష్ భార్యగా భూమిక నటించారు. భూమిక ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. కాలంతోపాటు సమాజంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నప్పటికీ సినిమాల్లో మాత్రం హీరోయిన్ల పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఫలితంగా నాటి నుంచి నేటి వరకు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ప్రాధాన్యత లేదని సీనియర్ నటి భూమిక చావ్లా ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలతో పోల్చుకుంటే.. వెబ్ సిరీస్‌లలో మాత్రం హీరోయిన్‌లకు మంచి ప్రాధాన్యతే దక్కుతుందని తాజాగా భూమిక చెప్పుకొచ్చారు.
ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో హీరోలు తనకంటే సగం తక్కువ వయసున్న హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ అంగీకరిస్తున్నారు. అలాగే, హీరోయిన్లు కూడా తమ కంటే పెద్దవారైన హీరోల సరసన నటించేందుకు సమ్మతిస్తున్నారు. ఈ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే వెబ్ సిరీస్‌ల విషయంలో మాత్రం హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. సినిమాల విషయంలో మాత్రం ఇంకా పాత విధానమే కొనసాగుతోంది’’ అని భూమిక ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న (Bhumika) భూమిక.. ప్రస్తుతం అక్క, వదిన వంటి పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య హీరోయిన్లు అందరూ హీరోల వయసు గురించే మాట్లాడుతున్నారు. హీరోల వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సినిమా సేల్ అవుతుంది కాబట్టే.. వారు ఇంకా రాణిస్తున్నారు. వారి సినిమాలకు బిజినెస్ జరుగుతుంది. హీరోయిన్లను చూసి సినిమాల బిజినెస్ జరగదు కాబట్టే.. వారిని నిర్మాతలు పట్టించుకోవడం లేదనేలా భూమిక మాటలకు నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.