Bhumika: కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన నటి భూమిక!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యువకుడు అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు నటి భూమిక చావ్లా. ఈమె ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.పెళ్లి తర్వాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇందులో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటి భూమిక చావ్లా కూడా కాస్త ఆలస్యంగా అయినా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. తాజాగా ఈమె రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదిక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈమె గోవాలో తన రెస్టారెంట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సమర వెల్నెస్ హోటల్ అంటూ భూమిక ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ఈమె ఎంతో మంది యంగ్ హీరోలకు వదిన అక్క పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus