టీచర్ నే పెళ్లి చేసుకున్న భూమిక..!

కరుణా కరణ్ డైరెక్షన్లో వచ్చిన ‘యువకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భూమిక అటు తరువాత పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రంతో క్రేజీ హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే అటు తరువాత చేసిన ‘స్నేహమంటే ఇదేరా’ ‘వాసు’ చిత్రాలు పెద్దగా ఆడకపోయినా … మహేష్ తో చేసిన ‘ఒక్కడు’ , ఎన్టీఆర్ తో చేసిన ‘సింహాద్రి’ చిత్రాలు ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసాయి. అయితే వాటి తరువాత వచ్చిన ‘సాంబ’ ‘జై చిరంజీవ’ చిత్రాలు నిరాశపరచడం… ఇలియానా, అనుష్క వంటి కొత్త భామలు ఎంట్రీ ఇవ్వడంతో ఈమెకు సహజంగానే డిమాండ్ తగ్గింది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘ఎం.ఎస్.ధోని’ ‘ఎం.సి.ఎ’ ‘సవ్యసాచి’ ‘రూలర్’ వంటి చిత్రాల్లో నటిస్తూ వస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. ఇదిలా ఉండగా…భూమిక 2007లో భరత్ ఠాకూర్‌ను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరిది ప్రేమ వివాహం అన్న సంగతి బహుసా ఎక్కువ మందికి తెలిసి ఉండడు. వివరాల్లోకి వెళితే… భరత్ ఠాకూర్ మరెవరో కాదు.. భూమికకు యోగా టీచర్. వీరి పరిచయం ప్రేమగా మారిన తరువాత నాలుగేళ్ళ పాటు డేటింగ్ చేసారట.

అటూ తర్వాతే పెళ్ళి చేసుకున్నారని తెలుస్తుంది. 2014లో వీళ్లకు ఓ బాబు పుట్టాడు.అతని పెరు యష్.’టీచర్ ను పెళ్లి చేసుకున్నారు ఏంటి?’… అని భూమికను ప్రశ్నిస్తే… ‘మా ఇద్దరి మనసులు కలిసాయి. అయినా భరత్ నాకు స్కూల్లో టీచర్ కాదు.. యోగా క్లాస్ టీచర్. అందులో తప్పేమీ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది భూమిక.

1

2

3

4

5

Bhumika Chawla, Bharat Thakur at April Fool Movie Press Meet Stills

6

7

8

9

10

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus