Deviyani Sharma: ‘సైతాన్’ లో బూతులు తిడుతూ నటించిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

దర్శకుడు మహి.వి.రాఘవ్ ‘పాఠశాల’ ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ వంటి మంచి సినిమాలు చేసి తన ఇమేజ్ ను పెంచుకున్నాడు. అలాగే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చి ‘సేవ్ ది టైగర్స్’ అనే వెబ్ సిరీస్ ను కూడా రూపొందించాడు. ఈ వెబ్ సిరీస్ విషయంలో ఇతను హద్దులు దాటింది ఏమీ లేదు. ఒకటి రెండు చోట్ల బూతులు ఉన్నప్పటికీ …. అవి అంత ఇబ్బంది పెట్టేలా ఏమీ ఉండవు. అయితే ఆ తర్వాత మహి వి రాఘవ్ ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్ చేశాడు.

ఇది మాత్రం ‘సేవ్ ది టైగర్స్’ కి పూర్తి భిన్నంగా ఉంటుంది. మితిమీరిన బెడ్ రూమ్ సన్నివేశాలు, బూతులు, హింస వంటివి పెట్టాడు. మొదట్లో జనాలు తిట్టుకున్నప్పటికీ తర్వాత అంతా లైట్ తీసుకున్నారు. ‘సేవ్ ది టైగర్స్’ అంత ఆకట్టుకోలేదు కానీ.. ఈ సిరీస్ కి కూడా మంచి వ్యూయర్ షిప్ వచ్చింది. అయితే ‘సైతాన్’ లో హీరో చెల్లి జయప్రద పాత్రలో నటించిన బ్యూటీని ఎవ్వరూ మర్చిపోలేరు.

ఈమె (Deviyani Sharma) బెడ్ రూమ్ సన్నివేశాల్లో చాలా ధైర్యంగా నటించి షాకిచ్చింది. అంతేకాదు కొన్ని చోట్ల బూతులు కూడా మాట్లాడింది. ఈమె మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అందులో లాయర్ పాత్రలో నటించి మెప్పించింది. ‘సైతాన్’ లో అయితే బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె పేరు దేవయాని శర్మ. ఢిల్లీలో జన్మించింది. ఈమెకు 2016లో ‘లవ్ శుద్ధ్’ అనే మూవీలో నటించింది.

ఆ తర్వాత ‘భానుమతి & రామకృష్ణ’ అనే సినిమాలో నటించి మెప్పించింది. అటు తర్వాత ‘అనగనగా’.. ఆకాష్ పూరి నటించిన ‘రొమాంటిక్’ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి వాటిలో నటించి పాపులర్ అయ్యింది. ‘సైతాన్’ తో ఈమె తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో ఈమె మరిన్ని ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus