Divi: అలాంటి అబ్బాయితోనే లైఫ్ అంతా.. అంటున్న ‘బిగ్ బాస్’ దివి..!

తాజాగా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ‘బిగ్ బాస్’ బ్యూటీ దివి. అతి తక్కువ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకుని… వారి మన్ననలు పొందినందుకు గాను దివి ఈ టైటిల్ ను సొంతం చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.ఇదిలా ఉండగా.. దివికి గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అని ఆమె హౌస్ లో ఉన్నప్పుడే చెప్పుకొచ్చింది. కానీ అతనితో కొన్ని కారణాల వలన బ్రేకప్ అయినట్టు కూడా ఈమె తెలిపింది.

తనతో ఉండాలి అంటే.. ఈమె ప్రొఫెషన్ ను పక్కన పెట్టి రావాలి అంటూ అతను డిమాండ్ చేసాడట. ఇప్పటినుండే తనపై ఆధిపత్యం వహించాలని ఆలోచించడం నచ్చక అలాగే ప్రొఫెషన్ ను దూరం చేసుకోలేక ఈ అమ్మడు అతనికి బ్రేకప్ చెప్పేసిందట. అయితే ప్రస్తుతానికి దివి సింగిల్ అట. తన ఫుల్ ఫోకస్ ఇప్పుడు కెరీర్ పైనే పెట్టినట్టు స్పష్టం చేసింది. అయితే తన ప్రొఫెషన్ ను అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికితే డేట్ కు రెడీ అంటూ ఈ అమ్మడు హింట్ ఇచ్చింది.

అయితే మీరు కోరుకునే అబ్బాయి ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అని దివిని ప్రశ్నించగా.. “నేను అబ్బాయిల్లో హైట్ అనేది ప్రధానంగా చూస్తాను. నా హైట్ 5’8 కాబట్టి.. నేను కోరుకునే అబ్బాయి 6’2,6’3 ఉండాలి అనుకుంటున్నాను. అలాగే తెలివైనవాడు అయ్యుండాలి. కష్టపడి పని చేయడానికి వెనుకాడకూడదు. అలాగే నన్ను బాగా చూసుకోవాలి. నా కష్టసుఖాల్లో ధైర్యం చెబుతూ నాకు తోడుగా ఉండాలి” అంటూ దివి మనసులో ఉన్న మాటలను చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus