దివి (Divi Vadthya) అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ 4 ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది. దీనికి ముందు మహేష్ బాబు (Mahesh Babu) ‘మహర్షి’ (Maharshi) వంటి పలు సినిమాల్లో నటించినా ఆమె ఫేమస్ కాలేదు. అయితే బిగ్ బాస్ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ‘గాడ్ ఫాదర్’ (God Father) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే.. మరోపక్క మెయిన్ లీడ్ గా కూడా చిన్న సినిమాల్లో నటిస్తుంది. ‘లంబ సింగి’ (Lambasingi) సినిమాలో దివి పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల దివికి చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యింది. అది ఎలా అనే విషయాన్ని ఈమె బయట పెట్టలేదు. కానీ దాని వల్ల ఈమె కాలు బెణికింది. బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఇంటిపట్టునే ఉంది. ఆ విషయాన్ని తెలుపుతూ దివి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ ను గమనిస్తే.. “ఒక్కోసారి జీవితం మనకు ఎన్నో సవాళ్లు విసురుతుంది. దాని వల్ల ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని ఒక చోట కూర్చోవాల్సి వస్తుంది.
అయితే ఇలాంటి టైంలో నాలో ఉన్న క్రియేటివిటీని వాడుకుని… నా కాలుకి వేసిన పట్టీని కాన్వాస్‌గా మార్చుకుంటూ గాయాన్ని మర్చిపోతున్నాను. గాయం ఓ మధుర జ్ఞాపకం మాదిరి… గీయడం, డూడ్లింగ్ చేయడం వంటి ద్వారా ఈ కష్ట సమయాన్ని కూడా ఆనందంగా దాటాలని నిశ్చయించుకున్నాను. సవాళ్లను ఎదుర్కోవడమే జీవితం, తప్పించుకోవడం కాదు అనేది నా అభిప్రాయం” అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది దివి (Divi Vadthya). ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.