‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) సినిమా విడులైనంత వరకు.. చాలా పాటలు లూప్‌లో వినిపించాయి, విన్నారు కూడా. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ అందరూ వేరే పాట వైపునకు వెళ్లిపోయారు. అదే ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు’. మీరు కూడా ఈ పాట వినే ఉంటారు. సోషల్ మీడియాలో అయితే పాట తెగ వినిపిస్తోంది. నిన్న ఉదయం వరకు యూట్యూబ్‌లో కూడా వచ్చింది. అయితే ఏమైందో ఏమో టీమ్ ఆ పాటను తీసేసిసింది. ప్రైవేట్ చేసి ఉండొచ్చు కూడా.
ఎందుకు చేశారు అనే విషయం ఆఖరులో చూద్దాం కానీ.. ఈ పాట వెనుక ఉన్న కథను ఇప్పుడే తెలుసుకోండి. అదేంటంటే.. అల్లు అర్జున్‌కు (Allu Arjun) తెలియకుండా ఆ పాటను రికార్డింగ్ చేశారట. సాంగ్ రికార్డింగ్ చేయాలని తొలుత అనుకోలేదట. అయితే షెకావత్‌కు పుష్పరాజ్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని సుకుమార్ (Sukumar) చెప్పడంతో.. సాంగ్‌లా అనిపించిందట. దాంతో ఆ పాట రికార్డింగ్ బన్నీ వాయిస్‌లో చేయాలనుకున్నారట.
దాంతో ప్లాన్ చేసిన ప్రకారం అల్లు అర్జున్‌ను సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) స్టుడియోకు తీసుకొచ్చారట. అక్కడ ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్..’ అనే లైన్స్ చెప్పించారట. ఆ మాటలకు సంగీత వాయిద్యాల్ని యాడ్ చేసి పాటను సిద్ధం చేశారట. అలా పాట రికార్డింగ్ చేసినట్టు చాలా రోజులు అల్లు అర్జున్‌కు తెలియదట. సినిమా ఫైనల్ కట్ చూసినప్పుడే బన్నీకి ఈ విషయం తెలిసిందట.
ఇక పైన చెప్పినట్లు డిలీట్ సంగతి చూస్తే.. పాట యూట్యూబ్‌లో టీసిరీస్ తెలుగు టీమ్ రిలీజ్ చేసినప్పుడే ఏదో తేడాగా ఉందే అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం బయట పరిస్థితి అల్లు అర్జున్‌కు ఏమంత బాగోలేదు. ఈ సమయంలో అలాంటి పాట రావడం ఇబ్బందికరమే అని వ్యాఖ్యలు వినిపించాయి. ఈ లోపు సినిమా టీమ్ చెప్పిందో, ఇంకేమైందో కానీ టీసిరీస్ టీమ్ ఆ వీడియోను యూట్యూబ్ నుండి తీసేసింది. మళ్లీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి. ఎందుకంటే పాటను పాటగా చూస్తే భలే ఉంటుంది ఆ పాట.
https://www.youtube.com/watch?v=JFNvac9Gh-o