తెలుగు, తమిళం, కన్నడ, కొంకిణి, హిందీ భాషల్లో బిజీగా వున్న నటి ఎస్తర్ నోరోన్హా పేరు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే, ఆమె మొదటిసారిగా ఒక సినిమాకి దర్శకత్వంతో పాటు ఇంకా సినిమాకి సంబందించిన అనేక డిపార్టుమెంట్ లలో పని చేసి చూపించింది. ‘ది వేకెంట్ హౌస్’ అనే ఒక కన్నడ/ కొంకిణి సినిమాకి ఎస్తర్ దర్శకత్వం వహించింది. “ఈ సినిమా షూటింగ్ పూర్తయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది,” అని చెప్పింది ఎస్తర్.
ఈ సినిమాలో నటించటం ఒక్కటే కాకుండా, ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, సంగీతం, కథ, రచన, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, కాస్ట్యూమ్ డిజైన్, నేపధ్య సంగీతం ఇలా సినిమాకి సంబంధించిన అన్ని డిపార్టుమెంట్ లలో ఎస్తర్ పని చేస్తోంది. అంటే ఒక సినిమాకి ఎన్ని కావాలో అన్నీ తానే అయి పని చేసింది అని అర్థం. అయితే దర్శకత్వం చెయ్యడం ఎలా వుంది అని అడిగితే, చాలా సులువుగా వుంది అంటోంది. “నేను చాలామంది దర్శకులతో పని చేసినప్పుడు ఆ దర్శకులు నాలో దర్శకుడు కూడా వుంది అని చెప్పేవారు.
నేను (Actress) ఏ దర్శకుడి దగ్గర పని చెయ్యలేదు, కానీ నాకు దర్శకత్వం చెయ్యాలని ఉండేది మొదటినుండీ, అలాగే నాకు అందరి దర్శకుల నుండి మంచి ప్రసంశలు రావటంతో, దర్శకత్వం చెయ్యాలని నిర్ణయించుకున్నాను”, అని చెప్పింది ఎస్తర్. అయితే అదేమీ అంత కష్టంగా అనిపించలేదు అని అంటోంది. “నాకు సులువుగానే అనిపించింది, అదేమీ అంత పెద్ద కష్టం కాదు”, అని తెలిసింది. అలాగే చిన్నప్పటి నుండి తనకు సంగీతం అంటే ఇష్టమని, స్కూల్, కాలేజీ ల్లో ఎన్నో సంగీత పోటీల్లో పాల్గొని ప్రైజ్ లు వచ్చాయని,
అందుకని సంగీతం మీద తనకు మంచి పట్టు ఉందని చెపుతోంది ఎస్తర్. అలాగే సినిమా ‘ది వేకెంట్ హౌస్’ గురించి చెపుతూ, ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథా చిత్రం అని, ప్రేక్షకులుకు తప్పకుండా ఇది నచ్చుతుందని చెపుతోంది. ఈ సినిమా షూటింగ్ మంగుళూరు దగ్గర ఒక ఫార్మ్ హౌస్ లో చేసినట్టుగా చెపుతోంది. అన్నీ అనుకూలిస్తే ఈ అక్టోబర్ లో ఈ సినిమా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా చెపుతోంది. ఈ సినిమాకి నిర్మాత గా కూడా ఎస్తర్ పని చేసింది.
గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!
బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!