Faria Abdullah: ఆ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు..చిట్టి కామెంట్స్ వైరల్?

జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ఇలా ఈమె నటించిన మొదటి సినిమాతోనే చిట్టి పాత్రలో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇలా జాతి రత్నాల సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి సందడి చేశారు. ఇకపోతే ఫరియా తాజాగా సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఫరియా అబ్దుల్లా తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తాను నటన విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదని తెలిపారు.

అవకాశాలు వస్తే యాక్షన్‌, సూపర్‌ నేచురల్‌, సైకో థ్రిల్లర్స్‌.. ఇలా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ఈమె వచ్చే ఐదు సంవత్సరాలలో తాను పాన్ వరల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందానని అదేవిధంగా దర్శకత్వం కూడా చేయాలని కోరికగా ఉంది అంటూ తన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా బయట పెట్టారు.

మరో 10 సంవత్సరాలలో తప్పకుండా తాను డైరెక్టర్ గా మారుతానని, తప్పకుండా దర్శకత్వం చేస్తానంటూ ఈ సందర్భంగా చిట్టి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక జాతి రత్నాలు సినిమాలో తను నటించిన చిట్టి పాత్ర ప్రతి ఒక్కరిని ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుందని ఈమె తెలియజేశారు. జాతి రత్నాలు సినిమాతో అందరిని మెప్పించిన చిట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా ద్వారా ఎలాంటి ఆదరణ పొందుతారో తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus