సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఉండే ఫాలోవర్స్ కారణంగా బ్రాండ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ వంటి వాటి ప్రమోషన్ డీల్స్ ఎక్కువ వస్తాయి. వాటి రూపంలో బోలెడన్ని డబ్బులు కూడా వస్తాయి. టాలీవుడ్లో కొంతమంది హీరోయిన్లు ఇలాగే సర్వైవ్ అయిపోతున్నారు. వాళ్లలో ఫరియా అబ్దుల్లా ఒకరని ఇండస్ట్రీలో వినిపించే టాక్. 'జాతి రత్నాలు' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా... ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. తర్వాత 'లైక్ షేర్ సబ్స్క్రైబ్' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'ఆ ఒక్కటీ అడక్కు' 'రావణాసుర' వంటి క్రేజీ సినిమాల్లో నటించింది. కానీ అవి ప్లాప్ అవ్వడంతో ఈమెకు పెద్దగా కలిసిరాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫరియా అబ్దుల్లాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వైట్ ఔట్ ఫిట్స్ లో బెడ్ పై పడుకుని యమ హాట్ ఫోజులు ఇచ్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి :