Gautami: ఆ కారణం వల్లనే చిరంజీవి పక్కన హీరోయిన్ గా చెయ్యలేకపోయాను : గౌతమి

చెప్పుకోడానికి తెలుగమ్మాయే అయినప్పటికీ .. టాలీవుడ్లో కంటే కోలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది గౌతమి. తెలుగులో ‘దయామయుడు’ ‘గాంధీ నగర్ రెండో వీధిలో’ చిత్రాలతో హీరోయిన్ గా మారిన గౌతమి.. ఆ తరువాత వెంకటేష్ తో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో కూడా నటించింది.అయితే వరుసగా ఈమెకు చిరంజీవి,నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చిన తరుణంలో.. ఈమె ఆ ఆఫర్లను మిస్ చేసుకుందట.

మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే.. మిస్ చేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా గౌతమినే ‘అలీతో సరదాగా’ షో లో పాల్గొని తెలిపింది. గౌతమి మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకటి కాదు, రెండు కాదు, మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ మిస్ చేసుకున్నాను. అందులో ‘స్టేట్ రౌడీ’ మూవీ ఒకటి. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది.

కానీ ఆ ఛాన్స్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. అదే టైములో రజినీ కాంత్, కమల్ హాసన్ గారి సినిమాలకు కమిట్ అవ్వడం తో సెట్ కాక ఈ ఇద్దరు స్టార్ల సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే.. చిరంజీవి గారి సినిమాల్లో ఆఫర్ వచ్చిన ప్రతీసారి.. ఆ టైంకి నేను రజినీకాంత్ గారి సినిమా చేస్తూ బిజీగా ఉన్నాను. అందువల్లే కుదర్లేదు” అంటూ ఈమె చెప్పుకొచ్చారు.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus