Gautami: సీనియర్ స్టార్ హీరోయిన్ గౌతమి సంచలన కామెంట్లు..!

తెలుగమ్మాయే అయినప్పటికీ.. టాలీవుడ్లో కంటే కోలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది హీరోయిన్ గౌతమి. అక్కడ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ‘దయామయుడు’ ‘గాంధీ నగర్ రెండో వీధిలో’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన గౌతమి అటు తరువాత తమిళ్ లో కమల్ హాసన్, రజినీ కాంత్ వంటి బడా హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘అలీతో సరదాగా’ షోకి గెస్ట్ గా వచ్చిన ఈమె ‘ఒరిజినల్ ఐటెం గర్ల్ నేనే’ అంటూ సంచలన కామెంట్లు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళంలో .. ఆ తరువాత వైజాగ్,కేరళ,బెంగుళూర్,చెన్నై ఇలా అన్ని ఊర్లలో నేను నివసించాల్సి వచ్చింది. ఇక ‘జెంటిల్మెన్ ‘ సినిమాలో ‘చికుబుకు చికుబుకు రైలే’ సాంగ్ నాకు మరిచిపోలేని అనుభూతిని కలిగించింది.ఆ పాటలో నేను ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్ చేశాను. సుందరం మాస్టర్ కు నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజుల నుండీ ప్రభుదేవా నాకు పరిచయం. ఎస్.ఏ. చంద్రశేఖర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పటి నుండీ డైరెక్టర్ శంకర్ తెలుసు.

ఓ రోజున శంకర్ గారు మా ఇంటికి వచ్చి .. చిన్న టేప్ రికార్డర్ లో ‘చికు బుకు రైలే’ పాటను వినిపించారు. ఈ సాంగ్లో మీరు చెయ్యాలి అన్నారు. దీని కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు చేస్తే సినిమాకి అదనపు ఆకర్షణ చేకూరుతుంది అని ఆయన అన్నారు. ఏదో ఆయన అడిగారు అని చేశాను కానీ.. ఆ పాట అంత హిట్ అవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. చెప్పాలంటే ఆ సినిమా తరువాత ‘ఒరిజినల్ ఐటమ్ గర్ల్ నేనే’ అంటూ చాలామంది కామెంట్లు చేశారు” అంటూ గౌతమి చెప్పుకొచ్చారు.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus