ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలకు ఎక్కువగా బెదిరింపు ఫోన్ కాల్స్ బెదిరింపు లెటర్స్ ఎక్కువయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఈ విషయం మర్చిపోకముందే మరొక నటికి ఏకంగా చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నటి స్వర భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమెను చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడంతో వెంటనే ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబైలోని వెర్సోవాలో నివాసం ఉంటున్న స్వరభాస్కర్ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఈమె వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఆశ్రయించి తనకు వచ్చిన బెదిరింపు విషయం గురించి ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈమెకు పంపించిన బెదిరింపు లేఖలో దుండగులు వీర సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదని స్వర భాస్కర్‌ను హెచ్చరించారు.
గతంలో నటి స్వర భాస్కర్ సోషల్ మీడియా వేదికగా బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ క్షమాపణలు చెప్పారని, తనని జైలు నుంచి విడుదల చేయాలి అంటూ బ్రిటిష్ పాలకులను అప్పటి వేడుకున్నారని ఇది ఏ మాత్రం వీరత్వం కాదు అంటూ స్వర భాస్కర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అలాగే మరోసారి కూడా ఈమె సావర్కర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఈ ట్వీట్స్ పెద్ద దుమారం రేపాయి.
తాజాగా ఉదయపూర్ లో జరిగిన హత్య గురించి నటి స్వర భాస్కర్ స్పందిస్తూ ఈ హత్యను తీవ్రంగా ఖండించడంతో మరోసారి ఈమె వార్తలు నిలిచారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె సంచలనమైన కామెంట్లు చేస్తూ పోస్టులు చేయడమే ఈ వ్యాఖ్యలే బెదిరింపులేఖలకు కారణమని, స్వరా భాస్కర్ ఇలాంటి సంచలన వ్యాఖ్యల ద్వారా ఇలాంటి బెదిరింపు ఆరోపణలను ఎదుర్కొంటుంది అంటూ పలువురు ఈ వార్తలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!