‘అఖండ 2’ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 4 నుండి అంటే ఈరోజు రాత్రి నుండి ప్రీమియర్ షోలు వేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆంధ్రాలో అయితే ప్రీమియర్ షోలకి, టికెట్ రేట్ల పెంపుకి అనుమతి లభించింది. అక్కడి ప్రభుత్వం బాలయ్యకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. అనుమతులు వెంటనే లభించాయి. కానీ తెలంగాణలో ఇంకా టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు లభించలేదు.
అందువల్ల ‘బుక్ మై షో’లో టికెట్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఇదిలా ఉంటే.. మరోవైపు ‘అఖండ 2’ విడుదల నిలిపివేయాలంటూ ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ సంస్థ కోర్టుకెక్కింది. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ’14 రీల్స్ సంస్థ’ తమకు చెల్లించాల్సిన రూ.28 కోట్లు చెల్లించలేదు అంటూ వాళ్ళు పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ వాళ్ళకి ’14 రీల్స్’ వారు క్లీయరెన్సులు చేస్తేనే సినిమా రిలీజ్ కి కూడా క్లీయరెన్స్ దక్కుతుందని స్పష్టమైంది.

అయితే తాజాగా జరిగిన విచారణలో మద్రాసు హైకోర్టు ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ వారు దాఖలు చేసిన కంప్లైంట్ ని తిరస్కరించినట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో ‘అఖండ 2’ నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది. ఇక ‘అఖండ 2’ రిలీజ్ కి ఎటువంటి అడ్డంకులు లేనట్టే అని ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. మరికొద్దిసేపట్లో ‘బుక్ మై షో’ వంటి యాప్స్ లో ‘అఖండ 2’ టికెట్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందట.
బాలయ్య -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన 4వ సినిమా ఇది. ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి సినిమాలతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టింది. అందువల్ల ‘అఖండ 2’ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
